విపత్తు నిర్వహణ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1

 

విపత్తు నిర్వహణ



1. కిందివాటిలో ఏ తుఫాను భూ ఆధారితమైనది?

1) హరికేన్‌ 

2) టైపూన్‌

3) విల్లీ-విల్లీ 

4) టోర్నడో

ANS: 4) టోర్నడో


2. కిందివాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో 

సంసిద్ధత అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంది?

1) ఎన్‌డీఆర్‌ఎఫ్‌

2) విపత్తు శిక్షణ కేంద్రం

3) జిల్లా యంత్రాంగాలు

4) ఎన్‌డీఎంఏ

ANS: 4) ఎన్‌డీఎంఏ


3. భారతదేశం మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు 

అయ్యింది?

1) హిమాచల్‌ ప్రదేశ్‌

2) ఉత్తరాఖండ్‌

3) గుజరాత్‌ 

4) జమ్ముకశ్మీర్‌

ANS:2) ఉత్తరాఖండ్‌


4. భీకర తుఫాన్‌ను (సూపర్‌ సైక్లోన్‌) ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగా 

విశాఖలో జరిగిన విపత్తు నిర్వహణ అభ్యాస కార్యక్రమం పేరు ఏమిటి?

1) ప్రకంపన 

2) పరాశక్తి

3) వాయుసిద్ధ 

4) సమయ్‌

ANS: 1) ప్రకంపన 


5. కిందివాటిలో ఏది వరద నిరోధక తగ్గింపు వ్యూహం కాదు?

1) ముంపు మైదానాల నుంచి జనాభాను తరలించడం

2) నదుల సమీపాన ఉన్న పరిశ్రమలను తరలించడం

3) అటవీకరణ

4) నదీప్రవాహ కాలువల పూడికతీత / అవరోధాల తొలగింపు

ANS: 2) నదుల సమీపాన ఉన్న పరిశ్రమలను తరలించడం


6. ఉత్తరార్ధగోళంలో తుఫానులో గాలి ఏ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది?

1) యాదృచ్ఛిక దిశ

2) సవ్య దిశ

3) అపసవ్య దిశ

4) గాలి నిశ్చలంగా ఉంటుంది

ANS: 3) అపసవ్య దిశ


7. హిమ సంపాతం ఏ రకమైన విపత్తు?

1) భౌమ సంబంధమైన

2) జల సంబంధమైన

3) జల, భౌమ సంబంధమైన

4) భౌమ వాతావరణ సంబంధ

ANS: 3) జల, భౌమ సంబంధమైన


8. విపత్తు నిర్వహణ కోసం సంసిద్ధతలో భాగంగా మొట్టమొదటిసారిగా అడవుల్లో 

కార్చిచ్చులపై అభ్యాస కార్యక్రమం 2017 ఎక్కడ జరిగింది?

1) ఉత్తరాఖండ్‌ 

2) మధ్యప్రదేశ్‌

3) ఛత్తీస్‌గఢ్‌ 

4) కర్ణాటక

ANS:1) ఉత్తరాఖండ్‌ 


9. ఉత్తర భారతంలో వేడి గాల్పులు సాధారణంగా ఏ కాలంలో ఉంటాయి?

1) ఏప్రిల్‌ నుంచి మే

2) ఏప్రిల్‌ నుంచి జూన్‌

3) మార్చి నుంచి మే

4) మార్చి నుంచి జూన్‌

ANS:4) మార్చి నుంచి జూన్‌


10. కార్గిల్‌ ప్రాంతంలో ఒక నదిలో మంచుకొండ చరియలు విరిగిపడి నదీ 

ప్రవాహాన్ని ఆపినప్పుడు, ఆకస్మిక వరదలు రాకుండా, పేలుడు పదార్థాలు 

ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో 

పిలిచారు?

1) ఆపరేషన్‌ సురు 

2) ఆపరేషన్‌ ఫుట్కల్‌

3) ఆపరేషన్‌ ద్రాస్‌ 

4) ఆపరేషన్‌ సరప్‌

ANS:2) ఆపరేషన్‌ ఫుట్కల్‌


===> జనరల్ సైన్సు ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===

===> సైకాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===

===> జియోగ్రఫీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===


11. విపత్తు తగ్గింపు చర్యల కోసం సెండాయి వ్యవస్థ ఏ సంవత్సరం వరకు 

అమల్లో ఉంటుంది?

1) 2025 

2) 2030

3) 2040 

4) 2050

ANS:2) 2030


12. విపత్తు సంభవించిన తరువాతి కాలంలో ఆ ప్రాంతం కోలుకోవడం 

పునర్నిర్మాణంపై ఐక్యరాజ్యసమితి వ్యవస్థ ప్రస్తుత ఆలోచనా విధానం ఏమిటి?

1) కనిష్ఠ పునరుద్ధరణ

2) మునుపటి స్థితి పునరుద్ధరణ

3) మునుపటి కంటే చక్కగా నిర్మించడం

4) ఎప్పటికప్పుడు మారుతుంది

ANS:4) ఎప్పటికప్పుడు మారుతుంది


13. విపత్తు జరగడానికి అవకాశం ఉన్న హానికారకాల్లో ఒకటి కానిది?

1) పేదరికం 

2) జనాభా విస్తృతి

3) ప్రదేశం 

4) మతం

ANS:1) పేదరికం 


14. ప్రాకృతిక విపత్తు అనేది ఏదీలేదు. కేవలం ప్రాకృతిక అపాయం తప్ప’ 

అనే వాక్యం

1) సత్యం 

2) అసత్యం

3) సత్యం లేదా అసత్యం కావచ్చు

4) అర్ధరహితం

ANS:2) అసత్యం


15. కిందివాటిలో ఏది ప్రాకృతిక విపత్తుకు కారక సంఘటన (ట్రిగ్గర్‌) కాదు?

1) యుద్ధం

2) పర్యావరణ అధోకరణం

3) సాంకేతిక ప్రమాదం

4) ఇచ్చిన అన్ని సమాధానాలు సరైనవే

ANS:3) సాంకేతిక ప్రమాదం


16. కింది కార్యాల్లో ఏది విపత్తు జరిగే సమయంలోను, విపత్తు 

తర్వాతి సమయంలోను ఉంటుంది?

1) నివారణ 

2) తీవ్రత తగ్గింపు

3) ఉపశమనం 

4) ప్రతిస్పందన

ANS:4) ప్రతిస్పందన


17. కిందివాటిలో ఏది భూకంపం నుంచి అత్యంత తీవ్రమైన 

ప్రమాదం ఉన్న జోన్‌ -5లో ఉన్నది?

1) షిల్లాంగ్‌ 

2) ఢిల్లీ

3) ముంబై 

4) చెన్నై

ANS:1) షిల్లాంగ్‌ 


18. భూకంపం ప్రారంభమయ్యే చోటును ఏమంటారు?

1) అధికేంద్రం 

2) కేంద్రం

3) నోడల్‌ కేంద్రం 

4) భూ కేంద్రం

ANS:2) కేంద్రం


19. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతాన్ని నెలలవారీగా దాటిన తుఫానుల్లో గత 100 ఏళ్ల సమాచారం చూస్తే ఏ నెలలో ఎక్కువ ఉన్నాయి?

1) సెప్టెంబర్‌ 

2) అక్టోబర్‌

3) నవంబర్‌ 

4) డిసెంబర్‌

ANS:2) అక్టోబర్‌


20. లాతురు భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.4 మాత్రమే నమోదైనా 

నష్టం మాత్రం తీవ్రంగా ఉండటానికి కారణం ఏమిటి?

1) లాతూరులోని భవనాలు బలహీనంగా ఉన్నాయి

2) బాధితులకు సహాయం సకాలంలో అందలేదు

3) భూకంప కేంద్రం కేవలం 10 కి.మీ. లోతులోనే ఉంది

4) భూకంప తీవ్రతను కొలిచే సాధనాలు సరిగ్గా లేవు

ANS:3) భూకంప కేంద్రం కేవలం 10 కి.మీ. లోతులోనే ఉంది


21. ఎన్‌.డి.ఎం.ఎ. లెక్కల ప్రకారం భారత్‌లోని వ్యవసాయ భూమిలో 

ఎంతశాతం కరువు బారినపడే ప్రమాదం ఉంది?

1) 68 శాతం 

2) 58 శాతం

3) 48 శాతం 

4) 38 శాతం

ANS:1) 68 శాతం 


22. విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది?

1) భగవంతుని ఇచ్ఛ ప్రకారం

2) సాధారణంగా రాత్రుల్లో

3) ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు

4) ఇచ్చిన సమాధానాల్లో ఏదీ సరైంది కాదు

ANS:3) ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు


23. కిందివాటిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవడానికి అవకాశం ఉంది?

1) మిల్లు కార్మికులు

2) దట్టమైన అడవుల్లో ఉన్న చిన్న పల్లెల్లో ఉండేవారు

3) పట్టణ శివారులోని విశాలమైన రహదారులున్న ప్రాంతంలోని ప్రజలు

4) ఇరుకైన రహదారులు ఉన్న పాతనగర ప్రజలు

ANS:4) ఇరుకైన రహదారులు ఉన్న పాతనగర ప్రజలు


24. కిందివాటిలో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహం?

1) ఇళ్లను దగ్గరగా కట్టడం

2) మట్టి ఇళ్లు కట్టడం

3) భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం

4) పట్టణాలకు వలసపోవడం

ANS:3) భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం


25. నగరం ముంపునకు గురికావడం?

1) ప్రకృతి సిద్ధమైన విపత్తు

2) చాలావరకు మానవ తప్పిదమే

3) ఎప్పుడూ మానవ తప్పిదమే

4) చాలావరకు ప్రకృతి సిద్ధమైన విపత్తు

ANS: 2) చాలావరకు మానవ తప్పిదమే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు