Psychology సైకాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1

Psychology సైకాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1




1)  రాజు ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు 

చిత్రలేఖనంలో దిట్ట చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు 

ఈ లక్షణాలు సూచించేది

1) వ్యక్తి అంతర్గత భేదాలు

2) వ్యక్తాంతర భేదాలు

3) అంతర వ్యక్తిగత భేదాలు

4) వ్యక్తి అంతస్థ బేధాలు


ANS: 1) వ్యక్తి అంతర్గత భేదాలు


2) వైయుక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంధం

1) Emily 

2) Mental tests and Measurment

3) Inquiry into Human Faculty and its  Devlopment

4) Democracy and Education


ANS: 3) Inquiry into Human Faculty and its  Devlopment


3) రమేష్ బాగా పరిచయస్తులు ఉన్నప్పుడు గలగల మాట్లాడతాడు కొత్తవారు 

ఉన్నప్పుడు ముభావంగా ఉంటాడు ఇది

1) వ్యక్తి అంతర భేదాలు

2) వ్యక్తి అంతర్గత భేదాలు

3) అంతర వ్యక్తిగత వేదాలు

4) వ్యక్తి అంతస్థ బేధాలు


ANS: 2) వ్యక్తి అంతర్గత భేదాలు


4)  ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులు అందరి 

నుంచి సరైన నిష్పాదన రాబడుతున్నాడు అయితే ఆ ఉపాధ్యాయుడు 

తన బోధనలో అనుసరించిన విధానంలో కింది వాటిలో సరైనది

1) ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి ఉత్సగత కలిగి ఉన్నాడు

2) అతడు తరగతి గదిని అందంగా ఆకర్షణీయంగా మార్చాడు

3) బోధనోపకరణాలను విరివిగా ఉపయోగించాడు

4) బోధనను వైయుక్తిక భేదాలను అనుసరించి జరిపాడు


ANS: 4) బోధనను వైయుక్తిక భేదాలను అనుసరించి జరిపాడు


5) కింది వాటిలో అంతస్థ వైయుక్తిక భేదంను గుర్తించండి

1) రహీం ఆటలు ఆడడం ఇష్టపడిన అంతగా చదువును ఇష్టపడు

2) అక్బర్ రాయడానికి ఇష్టపడితే కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు

3) రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించాడు

4) గిరి హరి ఇద్దరిలో ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటిపని హరి బాగా చేస్తాడు


ANS: 1) రహీం ఆటలు ఆడడం ఇష్టపడిన అంతగా చదువును ఇష్టపడు


===> జియోగ్రఫీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===


 6) నవీన్ చదరంగం బాగా ఆడలేదు కానీ లెక్కలు బాగా చేస్తాడు 

ఇది దేనికి ఉదాహరణ

1) చరశీల వైయుక్తిక భేదాలు

2) అంతర వ్యక్తిగత భేదాలు

3) వ్యక్తి అంతర్గత వైయుక్తిక భేదాలు

4) నిర్మాణాత్మక వైయుక్తిక భేదాలు


ANS: 3) వ్యక్తి అంతర్గత వైయుక్తిక భేదాలు


7) పరమేష్ చేతిరాత బాగుంటుంది గణితంలో అతడి నిష్పాదన 

సగటుగా ఉంది అతని సహధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద 

అతడి నిష్పాదన బాగుంది ఈ ఉదాహరణ ఏ రకమైన వైక్తిక భేదాన్ని తెలుపుతుంది

1) వ్యక్తి అంతర్గత వైయుక్తిక భేదం

2) వ్యక్తి అంతర వైయుక్తిగా భేదం

3) జోక్య సహిత వైయూక్తిక బేదం

4) వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైయుక్తిక భేదాలు


ANS: 4) వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైయుక్తిక భేదాలు


8) కిందివాటిలో వ్యక్తి అంతర్గత వేదాన్ని సూచించేది

1) పవన్ తన వయస్సు వారిలో ప్రజ్ఞాశాలి

2) రవి చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు

3) శ్రీకాంత్ తరగతి గదిలో సమయపాలన పాటించే విద్యార్థి

4) ప్రసాద్ స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత కలవాడు


ANS: 2) రవి చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు


9) వ్యక్తి అంతర భేదాలు వంటి

1) వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండా

2) వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం

3) ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించడం

4) ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం


ANS: 2) వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం


10) అంతర్గత భేదాలు

1) ప్రతి ఒక్కరికి ఉంటాయి

2) కొంతమందిలో ఉంటాయి

3) విద్యార్థుల్లోనే ఉంటాయి

4) ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి బయటకు కనిపించకుండా ఉండే భేదాలు


ANS: 1) ప్రతి ఒక్కరికి ఉంటాయి

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు