26. విమాన దుర్ఘటనలకు సంబంధించిన నోడల్ మంత్రిత్వశాఖ ఏది?
1) హోం వ్యవహారాల శాఖ
2) రవాణా మంత్రిత్వశాఖ
3) విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ
4) పౌర విమానయాన మంత్రిత్వశాఖ
27. భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చు?
1) జ్వలించే బల్బులను ఉపయోగించడం
2) ఫ్రిజ్‌లను ఉపయోగించడం
3) గృహ వ్యర్థాలను కంపోస్ట్‌గా చేయడం
4) అనేక పెంపుడు జంతువులను పెంచడం
28. తీరప్రాంతం మొత్తంలో ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ (ఈడబ్ల్యూడీఎస్)ను ఏర్పరచిన మొదటి రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) ఒడిశా
29. 2001 భుజ్ (గుజరాత్)లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఎంత?
1) 6.9
2) 6.8
3) 6.5
4) 6.4
30. గత శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని తాకిన 130 తుఫాన్లలో ఎన్ని అత్యంత తీవ్రమైనవి?
1) 29
2) 26
3) 33
4) 31
31. ప్రకృతి వైపరీత్యాలు, మానవులకు సంబంధించిన ప్రమాదాలు సంభవించినప్పుడు
ఏ కేంద్ర మంత్రిత్వశాఖ విపత్తు ప్రతిస్పందన నిర్వహణకు నోడల్‌శాఖగా వ్యవహరిస్తుంది?
1) గృహ మంత్రిత్వశాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ
4) వ్యవసాయ మంత్రిత్వశాఖ
32. భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కార్యాచరణ నామం ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి?
1) నావిక్
2) మాజిక్
3) లాజిక్
4) కాసిక్
33. భారత్‌లో భూకంప ప్రమాదానికి గురికాగల భూ విస్తీర్ణం సుమారుగా ఎంత?
1) 59 శాతం
2) 79 శాతం
3) 49 శాతం
4) 69 శాతం
34. కరువు తీవ్రత దేనివల్ల పెరుగుతుంది?
1) పర్యావరణ క్షీణత
2) ప్రజల నిర్లక్ష్య ధోరణి
3) అవగాహనా రాహిత్యం
4) ప్రసార సదుపాయాలు సరిగా లేకపోవడం
35. మనదేశంలో అత్యధిక వరదలు ఈ నదుల వల్ల కలుగుతాయి?
1) గంగా, బ్రహ్మపుత్ర
2) గంగా, యమున
3) గంగా, నర్మద
4) బ్రహ్మపుత్ర, నర్మద
36. దీర్ఘకాలపు సగటు వర్షపాతంతో పోలిస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతంలో
తగ్గుదల ఎంత శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని వర్షభావ సంవత్సరంగా పరిగణిస్తారు?
1) 19 శాతం
2) 20 శాతం
3) 21 శాతం
4) 25 శాతం
37. కిందివాటిలో దేన్ని జీవ ఆయుధంగా పరిగణిస్తారు?
1) అంత్రాక్స్ పార్శిల్
2) దోమల బెడద
3) పేను కొరుకుడు
4) మిడతల దాడి
38. వేలాదిమంది మరణానికి కారణమైన భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?
1) మిథైల్ ఐసో సైనేట్
2) మిథేన్
3) కార్బైడ్ ఐసో సైనేట్
4) ఇథైల్ ఐసో సైనేట్
39. ఈశాన్య రాష్ర్టాల ప్రాంతం ఏ భూకంప పాదక్షేత్రం (జోన్)లో ఉంది?
1) 5వ క్షేత్రం (జోన్)
2) 1వ క్షేత్రం (జోన్)
3) 2వ క్షేత్రం (జోన్)
4) 4వ క్షేత్రం (జోన్)
40. 1945 హిరోషిమాపై వేసిన ఆటంబాంబు పేరేమిటి?
1. లిటిల్‌బాయ్
2) ఫ్యాట్ మ్యాన్
3) బోల్డ్ లేడీ
4) లిటిల్ డెవిల్
